నాని వాల్ పోస్టర్ లో విశ్వక్షేన్! కన్ఫర్మ్ చేసిన నేచురల్ స్టార్

టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోగా మారిపోయి ప్రస్తుతం తెలుగు సినిమా యువ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న హీరో నేచురల్ స్టార్ నాని.

నాని తాజాగా జెర్సీ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్, అలాగే ఇంద్రగంటి దర్శకత్వంలో మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ మధ్య ఆ సినిమాతో నాని నిర్మాతగా మారి యంగ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మని టాలీవుడ్ కి పరిచయం చేసాడు.నిర్మాత‌గా తన టేస్ట్ కి తగ్గ సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్న నాని ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మంచి సినిమా అనే ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇక తన వాల్ పోస్టర్ బ్యానర్ లో రెండో సినిమాని నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు నాని ప్రకటించేసాడు.అది కూడా ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు విశ్వక్షేన్ హీరోగా ఉంటుంది అని చెప్పేసాడు.

తాజాగా ఫలక్ నుమా దాస్ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాని, ఇదే హీరోతో తన సొంత బ్యానర్ అయిన ‘వాల్ పోస్టర్’పై ఒక సినిమాను నిర్మించనున్నట్టు చెప్పాడు.తాను హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమా షూటింగ్ లు పూర్తి కాగానే ఈ సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు.

Advertisement
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

తాజా వార్తలు