నా భర్త ఎంటో నాకు తెలుసంటున్న దొరబాబు భార్య... మరి నెటిజన్లు....

ఇటీవల కాలంలో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం లో హైపర్ ఆది టీంలో పని చేస్తున్న దొరబాబు,పరదేశి అనే ఇద్దరు కమెడియన్లు విశాఖపట్టణంలోని ఓ అపార్ట్ మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ విషయం ఎంతగానో కలకలం రేపుతోంది.

అంతేకాక వీళ్లిద్దరూ పోలీసులకు వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడడంతో ఈ ప్రభావం దొరబాబు, పరదేశి ల సినీ జీవితం పై కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.అంతేకాక పలువురు నెటిజన్లు కూడా దొరబాబుని దారుణంగా నిందిస్తున్నారు.

అయితే ఈ విషయంలో మాత్రం దొరబాబు భార్య తెలుగు యాంకర్ నందిని రెడ్డి  దొరబాబు కి అండగా నిలుస్తోంది.అంతేగాక తన భర్త గురించి తనకు బాగా తెలుసని ఎవరూ తన భర్త గురించి చెప్పనవసరం లేదని దొరబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నెటిజన్ల పై మండిపడ్డారు.

అంతేగాక అందుకు వివరణ ఇస్తూ ఒక్కోసారి నిజానిజాలు ఏంటన్నది మన కళ్ళతో చూస్తే గాని తెలియదని అలాంటప్పుడు తన భర్త తప్పు చేశాడని ఎలా అంటారని వాపోయారు.అలాగే దొరబాబు సినిమా పరంగా చేసినటువంటి కొన్ని సన్నివేశాలను బట్టి కాకుండా నిజ జీవితంలో తాను ఎప్పుడూ తనని మరియు తన కూతురుని చాలా సంతోషంగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక సినిమాల్లో నటించినటువంటి బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ వంటివి తన సినీ వృత్తిలో భాగంగా నటించాడని, బయట దొరబాబుకి ఎటువంటి ఎఫైర్లు లేవని తెగేసి చెప్పేసింది.

అయితే ఈ విషయంలో మాత్రం యాంకర్ నందినీ రెడ్డికి  పలువురు సపోర్ట్ గా నిలుస్తున్నారు.ఎందుకంటే తప్పులు అనేవి అందరి జీవితంలోనూ జరుగుతాయని ఒక చిన్న తప్పు తమ జీవితాల్ని మరియు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకూడదని ఇలాంటి సమయంలో దొరబాబుకి తన అండదండలు అందిస్తున్నటువంటి యాంకర్ నందిని ని పలువురు అభినందిస్తున్నారు. .

Advertisement

తాజా వార్తలు