గులాబీ ఆఫీస్ చుట్టే నల్లగొండ పాలిటిక్స్...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ ప్రస్తుత రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి.

దానికి నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన "గులాబీ భవన్" ప్రధాన కేంద్ర బిందువుగా మారింది.

అధికార,విపక్ష నేతల మాటల యుద్ధం పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయన్న టాక్ వినబడుతుంది.కొద్దిరోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి( Kancharla Bhupal Reddy ) సవాళ్ల మీద సవాళ్లు విసురుకోవడం పొలిటికల్ వార్ కు దారితీసిందని అంటున్నారు.

అయితే వీరిద్దరి మధ్య పోరు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందట.కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఇద్దరి నేతల వ్యవహారం కలెక్టర్ స్థాయి అధికారికీ చికాకు తెప్పిస్తోందటా.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నల్గొండ పట్టణం నడిబొడ్డున ఖరీదైన స్థలంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం జరిగింది.ఈ కార్యాలయానికి మున్సిపల్ శాఖ నుంచి అనుమతి లేదనేది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాదన.

Advertisement

అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ కలెక్టర్ కు మంత్రి ఆదేశాలిచ్చారు.దాంతో ఎప్పుడైతే అధికారులకు ఆదేశాలిచ్చారో అప్పుడే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అలర్ట్ అయ్యారు.

పార్టీ కార్యాలయానికి అనుమతుల కోసం TSB PASS లో అప్లయ్ చేసుకున్నారు.ఈ ప్రాసేస్ ద్వారా 33% ఫెనాల్టితో అధికారులు అనుమతులు ఇవ్వొచ్చు.

కానీ,ఈ ప్రాసెస్ ను కూడా రిజెక్ట్ చేశారు అధికారులు.మంత్రి కోమటిరెడ్డి ఒత్తిడితోనే అధికారులు రిజెక్ట్ చేసి ఉంటారని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వర్షన్.

దాంతో B ప్లాన్ గా కోర్టును ఆశ్రయించారు భూపాల్ రెడ్డి.ఇష్యూ కోర్టుకు వెళ్ళేసరికి అధికారులు సైలెంట్ అయ్యారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో సరైన మర్యాద ఉండదు.. సంగీత సంచలన వ్యాఖ్యలు వైరల్!
సేఫ్టీ,సెక్యూరిటీ లేకుండా కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్స్

కోర్టు తీర్పు బట్టి స్టెప్ వేయాలనే ఆలోచనతో ఉన్నట్టు టాక్.ఇక ఇష్యూ ఎప్పుడైతే కోర్టుకు వెళ్లిందో మరోసారి గేర్ మార్చారు మంత్రి కోమటిరెడ్డి.

Advertisement

ఓ బహిరంగ సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫిస్ ను ఎందుకు కూల్చడం లేదంటూ అధికారులపై సీరియస్ అయ్యారు.ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komatireddy Venkat reddy)సవాళ్లకు భూపాల్ రెడ్డి ప్రతి సవాల్ విసరడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలని అధికారులకు చెప్పడం కాదనీ,దమ్ముంటే నువ్వే వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై చేయి వెయ్యంటూ కోమటిరెడ్డికి సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.ఒకవేళ తమ పార్టీ ఆఫీస్ కు కూల్చాల్సి వస్తే హైద్రాబాద్ లో గాంధీభవన్ తో సహా తెలంగాణలో అన్ని పార్టీల కార్యాలయాలు కూల్చాల్సి వస్తుందని భూపాల్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ పాలిటిక్స్ లో పెద్ద దుమారమే రేపాయి.

ఎందుకంటే అన్ని పార్టీల ఆఫీసులు ప్రభుత్వ స్థలాల్లో ప్రజల సొమ్ముతో కట్టారనేది దీనితో క్లియర్ గా కనబడుతోంది.ఇదే అధికార పార్టీకి తల నొప్పిగా మారిందని టాక్.

అందుకే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందట.ఒకవేళ అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్( BRS Party Office ) ను గనుక కూల్చేస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం నల్గొండలో పోరుకు సిద్ధమవుతుందన్న అంచనాకు వచ్చిందట హస్తం పార్టీ అధిష్ఠానం.

దాంతో గులాబి పార్టీకి మైలేజ్ కు తోడు సానుభూతి కూడా వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారట.పార్టీలో కొందరైతే కోమటిరెడ్డి అనవసరంగా నోరు జారారని,ప్రత్యర్ధులను హీరోలు చేస్తున్నారని మదనపడి పోతున్నారట.

ఈ పరిస్థితుల్లో సంయమనం పాటించకుంటే అవతలి పార్టీ వాళ్లకు ప్రజల్లో క్రేజ్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారట పార్టీ పెద్దలు.అందుకే పార్టీ కూల్చివేత ఇష్యూను లైట్ తీసుకోకుంటే,అది తిరిగి మనకే డ్యామేజ్ అవుతుందని కోమటిరెడ్డి కి కాస్తా సవివరంగా చెప్పారట పార్టీ సీనియర్ లు.మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కూల్చివేత కార్యక్రమం కోమటిరెడ్డి తనకు అడ్వాంటేజ్ అవుతుందనుకుంటే.పరిస్థితులు తలకిందులయ్యి ఆఖరికి అసలుకే ఎసరు తెచ్చేలా చేసిందట.

ఓటమి పాలయ్యాకా సైలెంట్ అయిన భూపాల్ రెడ్డిని అనవసరంగా నిద్ర లేపామా అని కొందరు కాంగ్రెస్ నేతలైతే తెగ ఫీలై పోతున్నారట.మరి ఈ గొడవ ఇంతటితో సద్దు మనుగుతుందో? లేదంటే ఇంకా ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందోనని ఇరు పార్టీల కేడర్ చాలా ఆసక్తిగా గమనిస్తుందట.చూడాలి మరి ఇందులో చివరకి పై చేయి ఎవరిది అవుతుందనేది.

Latest Nalgonda News