అక్కినేని అఖిల్( Akkineni Akhil ) తాజాగా నటించిన చిత్రం ఏజెంట్( Agent ) .
సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక అఖిల్ కెరియర్ లో ఈ సినిమా ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి.
ఇప్పటివరకు అఖిల్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అఖిల్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.అఖిల్ సైతం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తుంది.
ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి( Mammootty ) కూడా కీలక పాత్రలో నటించారు.
అఖిల్ ఏజెంట్ సినిమా గురించి నటుడు నాగార్జున ( Nagarjuna ) చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.నా కుమారుడివి అలాగే యంగ్ కొలీగ్ అయినా అఖిల్ నువ్వు కెరియర్ పరంగా చూసిన ఎత్తు పల్లాలు నాకు తెలుసు అలాగే ఈ సినిమా కోసం నువ్వు పడిన కష్టం, ఒక మంచి సినిమాని అందించాలని ఏజెంట్ మూవీ కోసం పడిన శ్రమ వృధా కాదని నా నమ్మకం తప్పకుండా ఈ సినిమాతో కెరీర్ లో మంచి సక్సెస్ సాధిస్తావ్ అంటూ ఈయన ఆకాంక్షించారు.అలాగే సినిమా కోసం కష్టపడిన చిత్ర బృందానికి ఈయన బెస్ట్ విషెస్ తెలియ చేశారు.
ఇక సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో యాక్షన్ స్పై త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ చిత్రాన్ని దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మించారు.
అయితే ఈ సినిమా నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరో అఖిల్ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి సాక్షి వైద్య( Sakshi Vaidya ) అనే హీరోయిన్ పరిచయమయ్యారు.
ఇక అఖిల్ కి ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy