బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
అయితే ఈ కార్యక్రమాన్ని ఎంతగా అయితే ఆదరిస్తారో అదే స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్న వారు ఉన్నారు.గత సీజన్ ప్రసారమైన సమయంలో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం సీజన్ సిక్స్ ప్రసారం కావడంతో మరోసారి సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇది బిగ్ బాస్ హౌస్ కాదని బ్రోతల్ హౌస్ అంటూ ఈయన ఇష్టమొచ్చినట్టు ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు.
ఇక ఈ కార్యక్రమం నిర్వాహకులను మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జునను సైతం ఈయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఇలా నాగార్జునను తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి నాగార్జున గత శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో పరోక్షంగా నారాయణ పై కౌంటర్ వేశారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా ఈ వార్తలపై నాగార్జున స్పందించారు.ఈ సందర్భంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎవరైనా జోక్ వేసినప్పుడు లేదా ఎవరినైనా నవ్వించాలనుకున్నప్పుడు ఇలా నారాయణ… నారాయణ అని పిలిచే అలవాటు తనకు ఉందంటూ ఈయన కామెంట్ చేశారు.శనివారం ఎపిసోడ్లో కూడా అందరినీ నవ్వించడం కోసమే తాను నారాయణ అంటూ పిలిచానని అంతేతప్ప ఎవరిని ఉద్దేశించి తాను అలా పిలవలేదని ఈ సందర్భంగా నాగార్జున క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే నాగార్జున సినిమాల విషయానికొస్తే ఈయన నటించిన ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.







