ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ శుక్రవారం కూడా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు బాక్సాఫీస్ వద్దకి రెండు సినిమాలు రాబోతున్నాయి.అందులో మొదటిది సుదీర్ బాబు హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి‘.
ఈ సినిమా నేపథ్యం సినిమా అవ్వడంతో ఒకింత ఆసక్తిని కలిగిస్తోంది.సినిమాలో హీరో ఫిలిం డైరెక్టర్ గా కనిపించబోతున్నాడు.
ఇక హీరోయిన్ హీరోయిన్ పాత్రలోనే కనిపించనుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్న కారణంగా కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి.
అనుకున్నట్లుగానే ఉన్నాయి.సినిమా ఒక మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటుందని నమ్మకాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి గత చిత్రం ‘వి‘ నిరాశపర్చింది.కనుక ఈ సినిమాపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టాడని వార్తలు వస్తున్నాయి.

ఇక మరో సినిమా విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని‘ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బాగా నిర్వహించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.రెండు సినిమాల కూడా టైటిల్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.ఈ మధ్య కాలంలో రెండు అక్షరాలు మూడు అక్షరాలు అంటూ టైటిల్స్ పెడుతున్నారు.కానీ ఈ రెండు సినిమాలు కూడా కాస్త పెద్ద టైటిల్స్ ని పెట్టడంతో ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికైనా రెండు మూడు సార్లు టైటిల్స్ ని ఆలోచించి ఉంటారు.
తద్వారా సినిమా ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది.కనుక తప్పకుండా ఈ సినిమాలు రెండు మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కితే కచ్చితంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.పెద్ద సినిమాలు పోటీ లేకపోవడం గత వారంలో విడుదలైన సినిమాలు డల్ అవడంతో కచ్చితంగా ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకుంటే మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.







