అమల ఎప్పుడూ నాకు నచ్చిన వంట చేయదు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున( Nagarjuna )అమల ( Amala ) దంపతులు ఒకరు వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున ఇటీవల నా సామిరంగా ( Naa Samiranga ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

Nagarjuna Interesting Comments About His Wife Amala, Amala, Nagarjuna, Naa Samir

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో నాగార్జున పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు వ్యక్తిగత విషయాల గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.మీకోసం అమల ఇంట్లో మీకు నచ్చిన వంటలు చేస్తారా అనే ప్రశ్న నాగార్జునకు ఎదురవడంతో అమల ఇంట్లో వంటలు చేస్తారు కానీ నాకు నచ్చిన వంటలు ఆమె చేయరు అంటూ నాగార్జున కామెంట్స్ చేశారు.

అమలా పూర్తిగా వెజిటేరియన్ మాంసాహారం అసలు ముట్టుకోదు నాకైతే మాంసాహార పదార్థాలను తినడం ఇష్టం అందుకే వాటిని అమల అస్సలు చేయదని నాగార్జున తెలిపారు.ఇక అమల ప్యూర్ వెజిటేరియన్ అందుకే కుక్కలకి కూడా తాను నాన్ వెజ్ పెట్టదు అంటూ నాగార్జున ఈ సందర్భంగా తెలియజేశారు.

Nagarjuna Interesting Comments About His Wife Amala, Amala, Nagarjuna, Naa Samir
Advertisement
Nagarjuna Interesting Comments About His Wife Amala, Amala, Nagarjuna, Naa Samir

ఇక షాపింగ్ చేయాలంటే మీరు ఇండియాలోనే చేస్తారా లేదంటే విదేశాలకు వెళ్తారా అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురవడంతో షాపింగ్ చేస్తాం కానీ ఇక్కడైతే అసలు చేయలేమని తప్పకుండా విదేశాలకే వెళ్తామని నాగార్జున తెలిపారు.ఇక బంగారం వంటి వస్తువులు కొనడానికి అమలకు ఏమాత్రం ఇష్టం లేదు ఆమె బంగారం కొనదు ఒకవేళ కొన్నా కూడా వాటిని ఎవరికో ఒకరికి కానుకగా ఇస్తుంది అంటూ నాగార్జున తెలిపారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు