టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి అందరికీ తెలిసిందే.తన తండ్రి అక్కినేని నాగార్జున స్థాయికి చేరాలని ఆశతో తన నటన ను ప్రారంభించాడు.
మొదటి సినిమా జోష్ లో నటించగా అంతగా విజయాన్ని సాధించలేకపోయాడు.కానీ తొలిసారి నటించిన ఆయన నటన మంచి గుర్తింపుతో ఉత్తమ నటుడు అవార్డు ను గెలుపొందాడు.
తరువాత ఏం మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు.కాగా నటి సమంతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఓ తమిళ సినిమాలో అతిధి పాత్రలో మెప్పించిన నాగచైతన్య దాదాపు 19 సినిమాలకు పైగా నటించి మంచి విజయాన్ని సాధించుకున్నారు.ఇదిలా ఉంటే నాగచైతన్య బాలీవుడ్లో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడానికి రాగా.ఏప్రిల్ 16న విడుదల కానుంది.
ఇక ఇదిలా ఉంటే నాగ చైతన్య పెళ్లి చూపులు ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాలో చేయనున్నట్లు తెలుస్తున్నాయి.ఈ సినిమా కథ నాగచైతన్యతో నచ్చడంతో ఓకే చెప్పినట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట.అంతేకాకుండా ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’.
ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.నాగచైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట.
ఈ విషయం గురించి టాలీవుడ్ సినీ వర్గాలు తెలుపుతున్నాయి.బాలీవుడ్ దర్శకులు ఈ సినిమా గురించి నాగచైతన్య కు తెలపగా వెంటనే నాగచైతన్య ఓకే చెప్పినట్లు తెలిపారు.
ఇందులో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.