Naga Chaitanya : ఎన్టీఆర్ గొప్పదనం గురించి నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. తాత అలా చెప్పేవారంటూ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా ఎక్కువ వినిపిస్తున్న పేరు సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ).

స్వర్గీయనటుడు విశ్వవిఖ్యాత అయిన నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు 2023 మే 28న జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.ఇప్పటికే అందుకు సంబంధించిన కార్యక్రమాలను మొదలుపెట్టేశారు.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలను ఈ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు( NTR centenary celebrations ) ఘనంగా జరుగుతున్నాయి.

అంతేకాకుండా ఖమ్మంలో( Khammam ) దాదాపు 5 కోట్ల భారీ బడ్జెట్ తో 40 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్ KPHB లో గ్రౌండ్స్ లో మరో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలతోపాటు రాజకీయ నాయకులు సైతం హాజరయ్యారు.

Advertisement

టాలీవుడ్ హీరోలు అయిన వెంకటేష్, శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, జయసుధ, జయప్రద, శ్రీలీల, అలాగే దర్శకులు తదితరులు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమానికి అక్కినేని వారసులు( Akkineni heroes ) హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

కాగా ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు గురించి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ అక్కినేని నాగచైతన్య, అఖిల్( Akkineni Nagachaitanya, Akhil ) బహిరంగ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.దాంతో వారిద్దరి మధ్య వివాదం మొదలైంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.అటువంటిది ఇప్పుడు ఈ వేడుకల్లో చైతన్య కనిపించడం దానికి తోడు బాలయ్యతో కలిసి మాట్లాడం అక్కినేని, నందమూరి అభిమానులను ఖుషి చేసింది.

కాగా ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ.ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు బాలకృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు.నందమూరి తారక రామారావు గారు నటన, అందం, వాత్సల్యం గురించి నేను సపరేట్ గా చెప్పనవసరం లేదు.

రాముడు, శ్రీ కృషుణుడు గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ముందు గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్.మా ఇంటిలో తాతగారు ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంతో గౌరవంగా మాట్లాడేవారు అని తెలిపారు నాగచైతన్య.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు