ఎట్టకేలకు గట్టి హిట్ కొట్టిన నాగ శౌర్య.. బాక్సాఫీస్ దగ్గర మరింత స్ట్రాంగ్ గా..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ప్రస్తుతం నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.లుక్ పరంగా కూడా నాగ సౌర్య అదుర్స్ అనిపిస్తున్నాడు.

ఈయన ప్రెసెంట్ అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో కృష్ణ వ్రింద విహారి సినిమాలో నటించాడు.మొన్న శుక్రవారం ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది.ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుని పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

Advertisement
Naga Shaurya's Krishna Vrinda Vihari Latest Update, Naga Shaurya, Krishna Vrinda

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు ఏదొక అడ్డు రావడంతో ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యింది.కొద్దిగా లేట్ గా వచ్చినా ఈ సినిమాతో నాగ శౌర్య ఎట్టకేలకు హిట్ అయితే అందుకున్నాడు.

బాక్సాఫీస్ దగ్గర కొద్దీ కొద్దిగా గ్రాఫ్ పెంచుకుంటూ పోతుంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మొదటి రోజు కంటే ఇప్పుడు వసూళ్లు కూడా బాగా పెరిగాయట.

యుఎస్ లో ఫస్ట్ రోజు తక్కువ కలెక్షన్స్ రాగా ఇప్పుడు వీకెండ్ దానిని కవర్ చేస్తుందట.ఎట్టకేలకు నాగ శౌర్య ఖాతాలో మరో హిట్ పడినట్టే.

Naga Shauryas Krishna Vrinda Vihari Latest Update, Naga Shaurya, Krishna Vrinda

నాగ శౌర్య గత సినిమాలు అంతగా హిట్ అవ్వలేదు.వరుడు కావలెను సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది.

ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?

దీని తర్వాత ఈయన లక్ష్య సినిమా కూడా అసలు వచ్చింది వెళ్ళింది కూడా తెలియలేదు.అందుకే ఈయన కెరీర్ కు ఒక మంచి హిట్ అవసరం అయినప్పుడు ఈ సినిమా సాలిడ్ హిట్ అయ్యి కెరీర్ కు మరింత ప్లస్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు