Naga chaitanya : నాగచైతన్య కూడా అలాంటి తప్పే చేస్తున్నాడా.. కస్టడీ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్?

వెంకట ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య కృతి శెట్టి( Krithi Shetty ) జంటగా నటించిన తాజా చిత్రం కస్టడీ.

ఈ సినిమా మీ 12వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఇప్పటికే ఈ సినిమా మంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.డైరెక్టర్ గారు ఈ సినిమా కథ చెప్పగానే వెంటనే లేచి ఆనందంతో ఆయనని హత్తుకున్నాను.షూటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ రెండో చూసినప్పుడు ఈ స్టేజి మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఏదో తెలియని ఆత్రుత.

Advertisement

అంతే కాన్ఫిడెన్స్ ను ఇచ్చేలా చేసింది.కోలీవుడ్ ఇండస్ట్రీలో వెంకట ప్రభును( Venkat Prabhu ) మాస్ అంటారు.

అక్కడ ఆయన పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు.మంచి మంచి హిట్ లను ఇచ్చారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగువారిని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ వెంకట్.

ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో కూర్చోబెట్టారు.ఇందులో అరవింద్ స్వామి గారు చేస్తున్నారు అని తెలియడంతో కాన్ఫిడెంట్ పెరిగింది.ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు.ఈ సినిమా మొదటి 20 నిమిషాలు డైరెక్టర్ గారిలా కూల్ గా ఉంటుంది.40 నిమిషాలు అయిన తర్వాత అసలు సినిమా మొదలవుతుంది.థియేటర్లో బ్లాస్టే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

నిజంగా ఈ సినిమాలో కొత్త చైతు ని చూస్తారు.మే 12న మీరందరూ నా కస్టడీలోకి వచ్చేస్తారు.

Advertisement

నా కస్టడీ లోనే ఉండాలని కోరుకుంటున్నాను.జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని తెలిపాడు నాగచైతన్య( Naga chaitanya )నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగచైతన్య కూడా ఇతర హీరోల మాదిరిగానే అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడని, కస్టడీ సినిమా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది మన కాలంలో మన తెలుగు హీరోలు ఈ విధంగానే అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్స్ చేయడంతో పాటు సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు.కానీ తీరా సినిమా విడుదలైన తర్వాత సినిమా ఫ్లాప్ అయ్యి ఇవ్వడంతో ఆ హీరోలు మళ్ళీ మీడియా ముందుకు కూడా రాలేదు.

దీంతో చైతు కూడా ఈ సినిమా విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు