సమంతపై ఇప్పటికీ గౌరవం ఉంది.. చైతూ మాటలకు అభిమానులు ఫిదా!

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య,సమంత విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

అయితే వీరికి విడాకులు తీసుకొని 10 నెలలు గడుస్తున్నా కూడా వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

తన ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.ఇకపోతే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న విషయం ఇప్పటివరకు తెలియదు.

ఇదే విషయం గురించి సమంత నాగచైతన్యలకు పలు సార్లు ప్రశ్నలు ఎదురైనప్పటికీ వారు తెలివిగా ఆ సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటున్నారు.అయితే మొదట్లో విడాకుల పై అసలు నోరు విప్పని నాగ చైతన్య లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ప్రమోషన్స్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేస్తూ వస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చైతన్య మాట్లాడుతూ.సమంత పై తనకు ఇప్పటికీ గౌరవం ఉంది అని తెలిపాడు.

Advertisement

కాగా తాజాగా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన నాగ చైతన్య కు సమంత కు సంబందించిన ఒక ప్రశ్న ఎదురైంది.విడాకుల గురించి కాకుండ కొత్తగా సమంత పై తన అభిప్రాయం ఏంటని అడగగా వెంటనే స్పందించిన చైతన్య సమంత అంటే ఇప్పటికీ తనకి అమితమైన గౌరవం ఉందని,.

తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదని, ఒక అండర్‌స్టాండింగ్‌తోనే మేం విడాకులు ప్రకటన ఇచ్చాము అని చెప్పు కొచ్చారు చైతన్య.

అయితే విడాకుల సమయంలో కూడా వారికీ ఒకరి పై మరోకరికి రెస్పెక్ట్‌ ఉందట.అయితే మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం.కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రారంభంలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.మరి చైతన్య వాఖ్యలపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు