Nadendla Manohar Pawan Kalyan: బీజేపీ కంటే టీడీపీతో పొత్తు బెటర్.. పవన్‌కు నాదెండ్ల హితభోధ

పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 10 రోజుల క్రితం విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవడం  రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

  తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని పవన్ కళ్యాణ్‌కు మోడీ ఇచ్చిన సలహాను కొంతమంది పార్టీ నాయకులు, ముఖ్యంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ నాదెండ్ల మనోహర్ పట్టించుకోలేదని వర్గాలు తెలిపాయి.

టిడిపితో పొత్తు పెట్టుకోకుండా బిజెపితో పొత్తు కొనసాగించాలని లేదా స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రధాని పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కావాల్సిన విషయాలను తాను చూసుకుంటానని, ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలనుకుంటే జనసేనకు బీజేపీ అన్ని విధాలా సాయం చేస్తుందని మోడీ హామీ ఇచ్చినట్లు సమాచారం.2023 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే దాదాపు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదని .వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు 80 వ ఏటలోకి అడుగు పెడుతారని.   కావున నార్టీ అద్యక్ష భాద్యతల నుండి తప్పకుంటారని  బీజేపీ నేతల వాదన.

 అప్పుడే పవన్ ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఎదగగలరని అంటున్నారు.పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, నాయుడుని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తే,  బీజేపీలా, జనసేనను సౌకర్యవంతంగా రాజకీయంగా బాబు ఎదగనివ్వడని. 

అంతేకాదు, నాయుడు నమ్మశక్యం కాని నాయకుడు , యూజ్ అండ్ త్రో వ్యూహాలకు పేరుగాంచాడు కాబట్టి పవన్ తమతో ఉంటే బెటర్ అని బీజేపీ అంటుంది.అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అంతంత మాత్రమే  ప్రభావం ఉన్న  బిజెపితో నడుచుకోకుండా, తన సొంత నిర్ణయం తీసుకోవాలని నాదెండ్లతో సహా పార్టీలోని సీనియర్ సహచరులు కొందరు పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చినట్లు తెలిసింది.జనసేనను పణంగా పెట్టి బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని, వచ్చే ఐదేళ్లపాటు జగన్ అధికారంలో ఉండేలా చూడాలన్నదే బీజేపీ జాతీయ నాయకత్వానికి మొత్తం ఉద్దేశమని పవన్‌కి పలువురు జనసేన నాయకులు  చెప్పారు.

Advertisement
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

తాజా వార్తలు