ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో నాదల్....ఘోరంగా ఓడిన ఫెదరర్

టెన్నిస్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూసిన రఫెల్ నాదల్, ఫెదరర్ ల పోరు ముగిసింది.

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.

శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో నాదల్,ఫెదరర్ పై తలపడ్డారు.అయితే 6-3,6-4,6-2 తో నాదల్ ఫెదరర్ పై విజయం సాధించాడు.

హోరాహోరీ గా సాగుతుంది అని భావించిన ఈ మ్యాచ్ లో ఫెదరర్ ఏమాత్రం నాదల్ కు పోటీ ని ఇవ్వలేకపోయాడు.దీనితో నాదల్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేశాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే మంచి దూకుడు గా ఆది వన్ మ్యాన్ షో గా మ్యాచ్ సాగింది.ఇప్పటికే 11 సార్లు టైటిల్ ను కైవసం చేసుకున్న నాదల్ ఇప్పుడు మరోసారి ఫైనల్ కు చేరుకున్నాడు.

Advertisement

దీనితో మరో సారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో గత 11 ఏండ్లలో ఫెదరర్‌కు అదే అత్యంత ఘోరమైన ఓటమి.పురుషుల సింగిల్స్ మరో సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్(సెర్బియా).

నాలుగో సీడ్ డొమినిక్ థీమ్(ఆస్ట్రియా) మధ్య పోరుకు వర్షం ఆటంకం కలిగించింది.అయితే నాదల్ తో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో ఎవరు తలపడనున్నారు అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు