టాలీవుడ్‌లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం రెండు చిత్రాలను రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే నాంది అనే సినిమాను రెడీ చేసిన ఈ హీరో, బంగారు బుల్లోడు అనే సినిమాను కూడా తెరకెక్కించాడు.
కాగా ఇందలో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసిన సినిమా నాంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఇదొక విభిన్న చిత్రంగా గుర్తింపును తెచ్చుకుంది.
అయితే నాంది చిత్రం చాలా సీరియస్‌గా ఉండనుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇక ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇక ఈ టీజర్‌లో అల్లరి నేరేష్ ఏకంగా నగ్నంగా కూడా కనిపించాడు.అయితే ఈ సినిమాను ఎవ్వరి ఊహలకు అందని విధంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.సాధారణంగా అల్లరి నరేష్ చిత్రానికి రూ.5 కోట్ల బడ్జెట్ ఎక్కువని భావిస్తుంటారు.కానీ ఈ సినిమాకు ఏకంగా రూ.8 కోట్ల మేర బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇంత బడ్జెట్‌ను కేవలం సినిమా కథపై నమ్మకంతో పెట్టారట చిత్ర నిర్మాతలు.ఈ సినిమా కథ అందరినీ ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.అల్లరి నరేష్ సినిమాలకు మార్కెట్ రూ.5 కోట్లు ఉండటంతో ఈ సినిమా అంత కలెక్షన్లు రాబడుతుందా లేదా అనే సందేహం సినీ వర్గాల్లో నెలకొంది.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.