ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా… ఏపీలోని రాజకీయ నిరుద్యోగులందరికి ఇప్పుడు జనసేన పార్టీ పెద్ద దిక్కుగా మారింది.ఏ పార్టీలో టికెట్ వచ్చే అవకాశం దొరకని… నాయకులకు… అన్ని పార్టీలను చుట్టి వచ్చేసి ఇక ఏ పార్టీలో వెళ్లలేని వారికి… జనసేన ఇప్పడు పెద్ద భరోసాగా కనిపిస్తోంది.
రావెల కిషోర్ బాబు….నాదెండ్ల మనోహర్… ఇటువంటి నేపధ్యం నుంచి వచ్చిన వారే.
ఇప్పుడు ఏపీలో రాజకీయంగా అప్రాధాన్యం అయిపోయిన వాళ్లు జనసేన వైపు చూస్తున్నారు అనేదానికి చక్కటి ఉదాహరణగా… నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నాడు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా… నాదెండ్లకు మంచి ప్రాధాన్యం దక్కింది.
స్పీకర్ గా చాలా హుందాగా వ్యవహరించాడు.ఆ తరువాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవ్వడంతో… ఏ పార్టీలో చేరాలో డిసైడ్ అవ్వలేక సైలెంట్ అయిపోయాడు.

కానీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనలో చేరి పార్టీలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతూ నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నాడు.దీనిపై పవన్ కోటరీలో నాయకులు గుర్రుగా ఉన్నా.పవన్ మాత్రం అవేవి పట్టించుకోవడంలేదు.ఇక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో….మరో సీనియర్ నేత అయిన మైసూరా రెడ్డి జనసేనలోకి వచ్చేందుకు పావులుకడుపుతున్నాడట.ఇప్పటికే మైసూర అన్ని పార్టీలను చక్కబెట్టేసాడు.
కాంగ్రెస్ పార్టీ లో ఒక వెలుగు వెలిగాడు.అయితే తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో తెలుగుదేశంలో చేరాడు.
అక్కడ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు.ఆ తరువాత ఆ పార్టీ వదిలి జగన్ చెంతకు చేరాడు.
కానీ ఇప్పుడు ఏ పార్టీలోనూ … లేడు.

ఆయన గత కొంతకాలంగా టీడీపీలోకి వెళ్లేందుకు పావులుకదిపినట్టు కూడా వార్తలు వినిపించాయి.కానీ అది జరగలేదు.అయితే… ఇప్పుడు మైసూర జనసేనలో చేరబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.అయితే ఆయన చేరిక పవన్ పార్టీకి ఏమైనా బలం తీసుకొస్తుందా అంటే… స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపించలేని పరిస్థితి.చెప్పుకోవడానికే సీనియర్ రాజకీయ నాయకుడు అయినా… కనీసం రాయలసీమలో రాజకీయాలను ప్రభావితం చేయలేని పరిస్థితి ఆయనది.
అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నా… రాజకీయ వ్యూహాలు పన్నడంలో మాత్రం వెనుకబడే ఉన్నాడు.ఇప్పుడు మైసూరా సీనియార్టీ ని పవన్ బాగానే ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.







