వామ్మో అమెరికా దెయ్యం.... అమెరికా ‘అరుంధతి’గా అనుష్క

లేడి ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు అనుష్క.ఈ అమ్మడు ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి చిత్రాల్లో నటించి అందరిని భయపెడుతూ మంచి సక్సెస్‌లను సొంతం చేసుకుంది.

 Anushka Shetty As American Arundathi In Kona Venkat Film 2-TeluguStop.com

‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క తదుపరి ప్రాజెక్ట్‌ ఏంటి అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.రచయిత కోన వెంకట్‌ ఈ విషయాన్ని అదికారికంగా ప్రకటించాడు.కోనవెంకట్‌ మరియు దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ కాంబోలో తెరకెక్కే చిత్రంలో అనుష్క నటించనున్నట్టు తెలుస్తోంది.

‘సైజ్‌ జీరో’ చిత్రంతో బాగా లావైన అనుష్క ఆ తర్వాత ఎన్ని వర్కౌట్‌లు చేసినా కూడా మునుపటిలా సన్నగా, నాజూగ్గా తయారవడం లేదు.దాంతో ఈ అమ్మడు అమెరికా వెళ్లి అందుకు తగిన చికిత్స చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.కోన వెంకట్‌ అందుకు సంబంధించిన అనుష్క ఫొటోను ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అనుష్క లుక్‌ మా సినిమాలో చాలా ఎగ్జయింట్‌గా ఉంటుంది, ఈ లుక్‌ తప్పకుండా తనుష్కకు బెస్ట్‌ లుక్‌ అవుతుంది అని పోస్ట్‌ చేశాడు.

వీరి కాంబో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా హారర్‌ థీమ్‌తోనే.అమెరికా హారర్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.మరోసారి అనుష్క అమెరికా దెయ్యంగా భయపెట్టేందుకు రెడీ అవుతోంది.

అమెరికా ‘అరుంధతి’గా అనుష్క కనబడబోతుంది అన్నమాట.అమెరికా దెయ్యంగా అనుష్క లుక్‌ చాలా బాగా ఉండబోతుంది అని కోన వెంకట్‌ ధీమా వ్యక్తం చేస్తుండడంతో ఈమె అభిమానులు ఇప్పటి నుండే ఆసక్తి కనబర్చుతున్నారు.

హారర్‌ చిత్రాలను అవలీలగా మెప్పించే అనుష్కకు ఈ చిత్రం కూడా మరో సక్సెస్‌ ఇస్తుందా? చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube