సినీ నటుడు, మా అద్యక్షుడు శివాజీ రాజ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్నాడు.ఈ సందర్బంగా మీకు గన్స్ అంటే ఇష్టమా అని అడిగితే నవ్వుతూ అవును అని చెప్పాడు.
కాగా ఎప్పుడైనా వేటకు వెళ్లారా అంటే ఏంటి ఇప్పుడు జైళుకు పంపిస్తారా అని ఫన్ కామెంట్స్ చేస్తూ లేదు, ఫాం హౌస్‌కు వెళ్లి నపుడు జస్ట్ చెక్ చేసే వాడిని అని సమాధానం ఇచ్చాడు.

గన్ కోసం నక్సలైట్ అవాలనుకున్నారా? అని అడిగితే అవును గన్ అంటే అంత ఇష్టం నాకు, ఇప్పటికి, ఎప్పటికి ఆ కోరిక అలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

‘సింధూరం’ చిత్రంలో ఆ తరహా పాత్ర నాది.అందుకే ఆ తర్వాత కూడా గన్ అంటే చాలా మోజు.అందుకే లైసెన్స్ వచ్చే వరకు వదిలి పెట్టకుండా లైసెన్స్ తెచ్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.పవన్ కళ్యాన్ గన్ గురించి అడగగా పవన్ గన్ మద్రాస్‌లో ఉంటుంది.

పవన్‌తో కలిసి నేను ఒకసారి ఫైరింగ్‌కు వెళ్లాను.పవన్ మంచి షూటర్.ఆయన వల్ల నాకు కూడా గన్ అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది అని పవన్ గన్ గురించి సంచలన సీక్రెట్స్ బయట పెట్టారు.

పవన్‌కు గన్ ఉంటందని అందరికి తెలుసు.గన్స్ అంటే ఆయనకు చాలా మోజు.అందుకే ప్రతీ చిత్రంలో పవన్ గన్ ఒక్కసారైనా పట్టుకుంటాడు.
గన్ పట్టుకోవడంలో పవన్ యాటీట్యూడ్ అందరికి నచ్చుతుంది, పవన్ గురి చూసి చాలా బాగా షూట్ చేస్తాడు అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే చిన్నప్పుడు బిస్కట్ షాపులో పనిచేస్తే బావుండు అనే కోరిక ఎలాంటిదో నాకు నక్సలైట్ అవాలని అలా ఉండేది, అదంతా గన్ మీద ఉన్న మోజు వల్లనే అని శివాజీ రాజ చెప్పుకొచ్చారు.







