ఎంవివి వైసీపీకి దూరమవుతున్నారా?

విశాఖ( Visakhapatnam )లో సంచలనం కలిగించిన ఎంపీ కుమారుని ( M.V.

V.Satyanarayana )కిడ్నాప్ వ్యవహారం ఆయనను పార్టీకి దూరం చేసే దిశగా సాగుతుందా ఆయన వ్యవహారశైలి చూస్తుంటే మాత్రం అవుననే అనిపిస్తుంది.

తన కుమారుడితోపాటు భార్యను తన ఆడిటర్ ను కిడ్నాప్ చేసిన వ్యవహారంపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారని, విశాఖ తనకు క్షేమం కాదనే నిర్ణయానికి వచ్చారని తన వ్యాపారాలని హైదరాబాద్ కేంద్రం గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తన వ్యాపారాలకు అనుమతి విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని కూడా విమర్శించారు .తన కొత్త ప్రాజెక్టు లో అడ్డుగా ఒక రాయి ఉందని బ్లాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి కోసం చూస్తున్నప్పటికీ 45 రోజులు గడచినా అనుమతులు రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు .తన వ్యాపారాలని తెలంగాణ మార్చాలని ఆయన సన్నిహితులతో చెప్తునట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి .

మరో వైపు తెలుగుదేశం పార్టీ( TDP ) నుంచి ఆయనకు మద్దతు పెరుగుతూ ఉండటం వైసిపి పార్టీ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది .ఎంపీ పై ఒత్తిడి తెస్తున్నారని, పార్టీ బెదిరింపులతో ఆయన తెలంగాణకు వెళ్లాలని చూస్తున్నారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆయన తెలుగుదేశానికి దగ్గరవుతున్నారని అనుమానాలు కలిగిస్తున్నాయి.ఇంతకుముందు కూడా విజయసాయి రెడ్డితో ఆయనకు విబేదాలు వచ్చినపట్టికి పార్టీ కలగ చేసుకుని క్లియర్ చేసింది .అయితే ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆయనకు పార్టీ నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో ఆయన రాజకీయంగా కూడా పార్టీ మారే ఉద్దేశం లో ఉన్నారం టూ వార్తలు వస్తున్నాయి .

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన వైసిపి కి దూరం అవటం ఎంతో దూరంలో లేదని తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషణలు వస్తున్నాయి.మరికొన్ని రోజుల్లో ఈ వ్యవహారం పై ఒక క్లారిటీ రావచ్చు .

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

తాజా వార్తలు