తండ్రి కూలి.. కొడుకు వ్యాపారంతో వందల రూ.కోట్లకు అధిపతి.. ముస్తఫా సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పేద కుటుంబాల్లో జన్మించిన వాళ్లు కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువు కాదు.

అయితే కాఫీ తోటలో పని చేసే కూలీ కొడుకు తన టాలెంట్ తో వందల కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు.

కూలిపని చేస్తూ సక్సెస్ సాధించిన ఈ వ్యక్తి పేరు ముస్తఫా( Mustafa ) కాగా లైఫ్ లో సక్సెస్ కావాలంటే పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని ముస్తఫా ప్రూవ్ చేశారు.కొత్తగా ఆలోచించి ఆచరణలో పెడితే సక్సెస్ దక్కుతుందని ముస్తఫా చెబుతున్నారు.

కేరళలోని( Kerala ) నిరుపేద కుటుంబంలో జన్మించిన ముస్తఫా తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్లేవాడు.చిన్నచిన్న పనులు చేస్తూనే స్కూల్ లో చదువుకునేవాడు.

ముస్తఫా తల్లి నిరక్షరాస్యురాలు కాగా ఆరవ తరగతి వరకు కూడా ముస్తఫా రాణించలేకపోయాడు.అయితే ఆ తర్వాత రోజుల్లో చదువు విషయంలో పట్టు పెంచుకుని టాపర్ అయ్యాడు.

Advertisement

తన టాలెంట్ తో ముస్తఫా ఎన్.ఐ.టీ ఇంజనీరింగ్ ( NIT Engineering )లో సీటు సంపాదించారు.ఆ తర్వాత రోజుల్లో ముస్తఫా ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేశారు.

వేర్వేరు దేశాలలో పని చేసిన ముస్తఫా అక్కడ సంతృప్తి లేక ఇండియాకు తిరిగి వచ్చారు.ఐడీ ప్రెష్( ID fresh ) పేరుతో ఇడ్లీ, దోశ పిండి విక్రయించడం మొదలుపెట్టి ముస్తఫా మంచి లాభాలను అందుకున్నారు.

ప్రస్తుతం ఈ సంస్థ టర్నోవర్ 300 కోట్ల రూపాయలుగా ఉంది.

చిన్న బిజినెస్ తో కూడా వందల కోట్ల రూపాయలు( Hundreds of crores of rupees ) సంపాదించవచ్చని ముస్తఫా ప్రూవ్ చేశారు.ఎంతోమంది యువతకు ముస్తఫా స్పూర్తిగా నిలిచారు.ముస్తఫా సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ముస్తఫా టాలెంట్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ముస్తఫా భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని లాభాలను అందుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు