ఆ ఒక్క హీరోతో ఇంకా పనిచేయలేదని అంటున్న తమన్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అందరూ రెండే పేర్లు చెబుతారు.

కొందరూ దేవి శ్రీ ప్రసాద్ అని, కొంత మంది ఎస్ఎస్ థమన్ అని అంటారు.

దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అందరితో పనిచేశాడు.థమన్ కూడా దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు.

కానీ అతనికి ఇంకా ఓ హీరో సినిమాకు మ్యూజిక్ చేయాలనే కోరిక అలాగే మిగిలి ఉంది.థమన్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించాడు.

కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మాత్రం ఇంకా ఒక్క సినిమాకు కూడా మ్యూజిక్ చేయలేదు.కిక్, వైశాలి సినిమాలతో టాలీవుడ్ లో థమన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

Advertisement
Music Director Ss Thaman About Not Working With Prabhas , Thaman, Music Director

బృందావనం, దూకుడు, బిజినెస్ మాన్ సినిమాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.తన పాటలతో, తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పెద్ద సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇటీవల పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాకు పనిచేసి మంచి మార్కులు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం థమన్ ఖాతాలో పెద్ద పెద్ద సినిమాలున్నాయి.

సరైనోడు, రేసుగుర్రం, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠ పురంలో లాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాలిచ్చిన థమన్ కు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి అవకాశం రాకపోవడం నిజంగా ఆశ్చర్యమే.ప్రభాస్ నటించిన సాహో, రెబల్ సినిమాలకు మొదటగా థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు.

Music Director Ss Thaman About Not Working With Prabhas , Thaman, Music Director

రెబల్ సినిమాకు ఆ సినిమా డైరెక్టర్ లారెన్స్ స్వయంగా తానే మ్యూజిక్ చేసుకున్నాడు.దీంతో థమన్ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత సాహో సినిమాకు కొడాఆ థమన్ నే అనుకున్నారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కానీ కుదరలేదు.ప్రస్తుతం ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లుగా అవకాశం వచ్చేలా లేదు.

Advertisement

దీంతో ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందించాలనే థమన్ కోరిక తీరడానికి ఇంకా కొన్నేళ్లు సమయం పట్టేలా ఉంది.

తాజా వార్తలు