తెలుగులో మూడో సినిమాని రామ్ తో ప్లాన్ చేస్తున్న మురుగదాస్

కోలీవుడ్లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు మురుగదాస్.

మురుగుదాస్ అంటే సోషల్ ఎలిమెంట్ తో కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

సూర్యతో చేసిన గజిని సినిమా మురుగదాస్ స్టామినా ఏంటో ప్రతి ఒక్కరికి చెబుతుంది.ఇక మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు తమిళ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.

ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ ద్వారా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.అతని సినిమాల్లో కథ కథాంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.

ఈ నేపథ్యంలోనే తమిళ ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా మురుగుదాస్ మంచి గుర్తింపు ఉంది.అయితే దర్శకుడికి స్ట్రైట్ తెలుగు సినిమా ద్వారా ఇప్పటి వరకు మురుగదాస్ కి సక్సెస్ దక్కలేదు.

Advertisement

తెలుగులో మొదటి సినిమాని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశాన్ని మురుగదాస్ సొంతం చేసుకున్నారు.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్టాలిన్ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇందులో కాన్సెప్టు ప్రేక్షకుడుకి కనెక్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ స్టోరీకి అడ్డంకిగా మారిందనే టాక్ వచ్చింది.ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ మూవీని తెలుగులో స్ట్రైట్ గా చేశారు.ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్న కూడా ప్రేక్షకులకి అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాలేదు.

ఇక్కడ కూడా సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ కథకి అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమైంది.మహేష్ ఇమేజ్ తగ్గట్టు కథను మురుగుదాస్ చెప్పలేకపోయారని నెగిటివ్ అభిప్రాయం టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి వచ్చింది.

ఇదిలా ఉంటే స్ట్రైట్ తెలుగు సినిమా ద్వారా కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో మురుగదాస్ ఎదురు చూస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఈసారి స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా మినిమమ్ రేంజ్ హీరోతో సినిమా ప్లాన్ చేసుకోవాలని భావించి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కథను కూడా వినిపించడం జరిగిందని తెలుస్తుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

రామ్ కూడా మురుగదాస్ చెప్పిన స్టోరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో చేయబోయి మూవీ కంప్లీట్ అయిన తర్వాత మురుగుదాస్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ లో హీరో రామ్ ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట .

తాజా వార్తలు