Mahesh Babu Murari : మురారి సినిమా ఆ స్టార్ హీరోతో చేయాల్సింది.. కానీ మధ్యలో మహేష్ వచ్చాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి ( Rajamouli ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

అయితే ఈయన చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు సూపర్ సక్సెస్ లని సాధిస్తూ వస్తున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతుంది.ఈ సినిమా భారీ హిట్టు సాధించడమే కాకుండా ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుంది అనే నమ్మకంతో సినిమా యూనిట్ ముందుకు కదులుతుంది.ఇక ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇండియాలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం.ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీయర్ మొదట్లో ఆయన చేసిన మురారి సినిమా( Murari Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.

Advertisement

అయితే ఈ సినిమాను మహేష్ బాబు కి ముందు కృష్ణవంశీ( Krishna Vamshi ) జూనియర్ ఎన్టీఆర్ తో( Jr NTR ) చేయాలని అనుకున్నాడట కానీ ఈ సినిమా కథ కృష్ణ దగ్గరికి వెళ్లడంతో ఈ సినిమాని మహేష్ బాబుతో చేయమని కృష్ణ కృష్ణవంశీని అడిగాడట దాంతో కాదనలేక పోయిన కృష్ణవంశీ మురారి సినిమాని మహేష్ బాబుతో చేశాడు.ఈ సినిమాతో మహేష్ బాబు మొదటి బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా నటన పరంగా కూడా తనలోని వైవిద్యమైన నటనని కూడా ప్రదర్శించాడు.ఇక ఈ సినిమాతో మహేష్ బాబు నటుడుగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ఈ సినిమాని మహేష్ బాబు తో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు