Murali Mohan Mani Ratnam : ఆ మూవీ వల్ల సంపాదించిందంతా మురళీ మోహన్ పోగొట్టుకున్నారా.. ఏమైందంటే?

ప్రముఖ నటుడు మురళీ మోహన్ నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకోగా పలు వ్యాపారాల ద్వారా కూడా ఆయన సత్తా చాటారు.మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు కాగా చాటపర్రు గ్రామంలో జన్మించిన మురళీ మోహన్ కెరీర్ తొలినాళ్లలో నాటకాల్లో నటించారు.జగమే మాయ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మురళీ మోహన్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Murali Mohan Shocking Comments Goes Viral In Social Media Details Here , Murali-TeluguStop.com

350కు పైగా సినిమాలలో నటించిన మురళీ మోహన్ 25కు పైగా సినిమాలను నిర్మించి ఆ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మురళీ మోహన్ సత్తా చాటారు.2014 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన మురళీ మోహన్ విజయం సాధించారు.మురళీ మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

వ్యాపారంలో సక్సెస్ లో ఉన్న సమయంలో సినిమాల్లోకి వెళ్లాలా? వద్దా? అని అనిపించిందని ఆయన తెలిపారు.ఆరోజుల్లో చిరంజీవి గారు నన్ను అన్నయ్య అని పిలిచేవారని మురళీ మోహన్ పేర్కొన్నారు.మణిరత్నం ఇద్దరు మూవీతో సంపాదించిందంతా పోగొట్టుకున్నానని ఆయన అన్నారు.అతడు మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో పెరిగిందని 6 నెలల్లో షూట్ పూర్తి కావాల్సిన సినిమా 18 నెలలు పట్టిందని మురళీ మోహన్ తెలిపారు.

Telugu Chiranjeevi, Edaaru, Mani Ratnam, Murali Mohan, Tollywood-Movie

సినిమా రంగంలో ఎన్నేళ్లు ఉన్నా కొన్ని అలవాట్లకు బానిక కాకూడదని నేను భావించానని ఆయన అన్నారు.చాలామంది చెప్పినా చెడు అలవాట్ల బారిన నేను పడలేదని ఆయన పేర్కొన్నారు.నేను నిర్మించిన సినిమాలలో 75 శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయని మురళీ మోహన్ వెల్లడించారు.

మురళీ మోహన్ ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.మురళీ మోహన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube