Tollywood Box Office Movies : 2022 లో తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ ప్రాఫిట్స్ అందించిన సినిమాలు ఇవే!

గత రెండేళ్లు కరోనా కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.ఇక సినీ ఇండస్ట్రీకి అయితే కోట్లలో నష్టం వాటిల్లింది.

 Tollywood Box Office Collection 2022 Report , Tollywood, Box Office Collection 2-TeluguStop.com

ఎంతో మంది నిర్మాతలు సినిమాలను ధియేట్రికల్ గా రిలీజ్ చేయకుండా ఓటిటిలో అమ్మేసుకున్నారు.థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితులు లేకపోవడంతో చాలా నష్టాలు వాటిల్లాయి.అయితే ఈ ఏడాది మాత్రం మిగతా ఇండస్ట్రీల కంటే మన ఇండస్ట్రీ కాస్త కోలుకుంది అనే చెప్పాలి.

2022 స్టార్టింగ్ నుండి తెలుగు పరిశ్రమకు బాగానే కలిసి వచ్చింది.మిగతా ఇండస్ట్రీల కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ను మన టాలీవుడ్ అందుకుంది.మరి ఈ ఏడాది తెలుగులో అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ సాధించిన సినిమాలు ఏంటో మీకు తెలుసా.ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ :

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు.ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.నిర్మాతలకు ఈ సినిమా దాదాపు 150 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.

కార్తికేయ :

నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 సూపర్ హిట్ అయ్యింది చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ అందుకుంది.కార్తికేయ 2 నిర్మాతలకు 45.5 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.

Telugu Bimbisara, Box, Dj Tillu, Karthikeya, Seetharam, Tollywood, Tollywood Box

బింబిసార :

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా వల్ల నిర్మాతలు దాదాపు 22 కోట్ల లాభాలు పొందారట.

సీతారామం :

ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది.దాదాపు 29 కోట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది.

మేజర్ :

అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా 14 కోట్ల లాభాలు అందించిందట.మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

Telugu Bimbisara, Box, Dj Tillu, Karthikeya, Seetharam, Tollywood, Tollywood Box

డీజే టిల్లు :

ఈ సినిమా నిర్మాతలకు 8 కోట్ల లాభాలు తెచ్చి పెట్టిందట.మన తెలుగు సినిమాలే కాకుండా ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా టాలీవుడ్ లాభాలు అందుకుంది.కన్నడ సినిమా కాంతారా అయితే 25 కోట్ల ప్రాఫిట్ అందించినట్టు తెలుస్తుంది.

అలాగే కమల్ హాసన్ విక్రమ్ సినిమా 10 కోట్లు, బాలీవుడ్ బ్రహ్మాస్త్ర 8 కోట్ల ప్రాఫిట్స్ అందించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube