చలో గుంటూరు అంటున్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుతం హైదరాబాద్‌ నుండి పాలన వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్న విషయం తెల్సిందే.

హైదరాబాద్‌ నుండి పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పరిపాలన చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర విభజన చట్టం ఇచ్చింది.

అయితే పరాయి రాష్ట్రం నుండి ఎంత త్వరగా వెళ్లి పోతే అంత మంచిది అనే ఉద్దేశ్యంతో ఏపీ మంత్రులు మరియు ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.వసతులు లేకున్నా కూడా ఆంధ్ర ప్రదేశ్‌ పాలనను అక్కడి నుండి చేయాలని నిర్ణయించుకున్నారు.

ముందుగా పురపాలక శాఖను హైదరాబాద్‌ నుండి గుంటూరుకు మార్చాలని నిర్ణయించారు.ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు.

ఫిబ్రవరి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో విదులు నిర్వహిస్తున్న పురపాలక శాఖ అధికారులు మొత్తం గుంటూరుకు వెళ్లాల్సిందే అని ప్రకటించాడు.గుంటూరు మార్కెడ్‌ యాడ్‌ భవనంను తాత్కాలిక కార్యాలయంగా ఏర్పాటు చేసినట్లుగా నారాయన చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే ఉన్నపళంగా చలో గుంటూరు అంటే ఎలా అంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పిల్లల చదువులతో పాటు, ఫ్యామిలీలను గుంటూరుకు ఇంత తక్కువ సమయంలో తీసుకు వెళ్లడం అసాధ్యం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రిగారు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు కోరుకుంటున్నారు.మరి మంత్రి నారాయణ వారికి మరి కాస్త సమయంను ఇస్తాడేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు