'ముందస్తు' వ్యూహం ! తెలంగాణ అసెంబ్లీ రద్దు ..?

అదిగో పులి .ఇదిగో తోక అన్నట్టుగా తయారయ్యాయి రాజకీయ పార్టీలు .

ఎన్నికలు ఖచ్చితంగా ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ.వాటి కోసం ఇప్పటి నుంచే పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తగిన ప్రణాళికలు వేసుకుంటూ వ్యూహాలు సిద్దము చేసుకుంటున్నాయి.ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తుండడంతో పార్టీల్లో కంగారు మరింత పెరిగింది.

జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు ఊపందుకున్నాయి.

Advertisement

జమిలి ఎన్నికల కోసం అందరికంటే మేమే ముందుగా ఎదురు చూస్తున్నాము అని టీఆర్ఎస్ బిల్డప్ ఇస్తోంది.ఈ మేరకు ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందట.ఒకవేళ లోక్ సభకు ముందస్తు ఎన్నికలు అనివార్యమైతే, వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా సిద్ధమవ్వాలని తెరాస భావిస్తోందట.

ఇప్పటికే కేసీఆర్ ఈ విషయం గురించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది.సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్న టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ దీనిపై పలువురు ప్రముఖుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు .

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఈఎస్‌ఎల్‌ గవర్నర్‌ నరసింహన్‌తో ఆయన సమావేశమయ్యారు.ఆదివారం మధ్యాహ్నం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లిన సిఎం కెసిఆర్‌ గవర్నర్‌ నరసిం హన్‌తో పలు అంశాలపై చర్చించారు.

అంతకు ముందు ప్రగతి భవన్‌లో దేవగౌడతో చర్చించిన అంశాలు కెసిఆర్‌ గవర్నర్‌ వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.కేంద్రంతో పాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే జూలై రెండు లేదా మూడో వారంలో అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనపై గవర్నర్‌తో చర్చించారని తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

కేసీఆర్ ఏం ధైర్యం చూసుకుని ముందస్తు ఎన్నికల కోసం ఇంత కంగారు పడుతున్నాడా అని ప్రత్యర్థి పార్టీలు ఆలోచనలో పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు