వైసీపీలోకి ముద్రగడ ? కుమారుడికి టికెట్ 

రాష్ట్రవ్యాప్తంగా తటస్తులు , ఇతర పార్టీలోని కీలక నేతలను చేర్చుకునే విధంగా పావులు కలుపుతోంది అధికార పార్టీ వైసిపి.సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉండడం, పార్టీలో టిక్కెట్ల కేటాయింపు వ్యవహారాలు జోరందుకోవడం వంటి చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న జగన్ , వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వై.  నాట్ 175 నినాదాన్ని వినిపిస్తున్నారు.ఇక కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) ఎప్పటినుంచో వైసీపీలో చేరుతారనే హడావుడి జరుగుతున్నా,  ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే వస్తుంది.

 Mudragada Into Ycp Ticket For Son , Kapu Regervaton, Mudragada Padmanabam,-TeluguStop.com

  కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని మొదలుపెట్టినా,  ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు.  అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు అప్పుడప్పుడు జగన్కు లేఖలు రాస్తూ వార్తల్లోకి వస్తున్నారు.

Telugu Godavari, Jagan, Kapu-Politics

కాపు సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడం,  వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉండడంతో,  ముద్రగడను వైసీపీలో చేర్చుకునే విషయంపై జగన్ సైతం ప్రత్యేకంగా పెట్టారు .ఈ మేరకు మరికొద్ది రోజుల్లోనే ముద్రగడ వైసిపి కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదట.తనకు బదులుగా తన కుమారుడు ముద్రగడ చల్లారావుకు( Mudragada challarao ) వైసిపి టికెట్ ఇవ్వాలని షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి జగన్ కూడా సానుకూలంగానే స్పందించడంతో ముద్రగడ చేరిక లాంఛనంగా మారింది.  మరి కొద్ది రోజుల్లోనే ముద్రగడ వైసిపి కండువా కప్పుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తన కుమారుడు చల్లారావు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ముద్రగడ వైసిపి లో చేరాలని నిర్ణయించుకున్నారట.

Telugu Godavari, Jagan, Kapu-Politics

 ప్రస్తుతం వైసీపీలో( YCP ) నియోజకవర్గ ఇన్చార్జిలో మార్పు వ్యవహారం సంచలనంగా మారింది.  సర్వే నివేదిక ఆధారంగా జగన్( CM jagan ) ఈ భారీ ప్రక్షాళనకు తెర తీశారు.దీంతో ఇప్పుడు వైసీపీలో చేరితేనే తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకున్న ముద్రగడ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube