Mahendra Singh Dhoni : కొత్త అవతారమెత్తిన ధోనీ…ఈసారి ఐపిఎల్ ఆడుతాడా..? లేదా..?

ఐపీఎల్( IPL ) హిస్టరీ లోనే అత్యధిక విజయాలను సొంతం చేసుకున్న టీముల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి.

ఇక ఈ సీజన్లో కూడా తన సత్తా చాటడానికి రెఢీ అవుతుంది.

ఇక అందులో భాగంగానే ఇప్పటికే చెన్నై టీం కెప్టెన్ అయిన మహేంద్రసింగ్ ధోని( Chennai Team Captain Mahendra Singh Dhoni ) తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడు.ఇక దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కూడా ఎలాగైనా కప్పు కొట్టడమే లక్ష్యంగా చెన్నై టీమ్ బరిలోకి దిగుతుంది.ఇక రీసెంట్ గా ధోని ఒక కొత్త అవతారంలో కనిపించబోతున్నాను అంటూ ఒక ట్వీట్ చేశాడు .ఇక దాంతో చాలామందిలో ధోని ఈసారి చెన్నై టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడా? మెంటర్ గా మారుతాడా? అనే అనుమానులు కూడా వ్యక్తమయ్యాయి.

కానీ ఆ పోస్టులో అర్థం ఏమిటి అంటే జియో సినిమా( Jio Cinema ) కోసం ఆయన ఒక ఆడ్ లో కనిపించాడు.ఇక ఆ ఆడ్ లో 60 ఏళ్లు పైబడిన వృద్ధుడి పాత్ర లో నటించి మెప్పించాడు.ఇక ఇది చూసిన అభిమానులు అందరూ ఇంతకుముందు ఆయన పెట్టిన పోస్ట్ లో అర్థం ఇదే అని అనందపడుతున్నారు.

Advertisement

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అనంత్ అంబానీ మ్యారేజ్ ఈవెంట్( Anant Ambani Marriage Event ) లో పాల్గొన్న ధోనీ అక్కడ కూడా సందడి చేశాడు.ఇక దాని తర్వాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ ని కూడా మొదలుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ధోని ఈసారి కూడా చెన్నై టీం కి కప్పును అందించి వరుసగా రెండోసారి కప్పు అందుకున్న టీం గా మరోసారి రికార్డ్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక 2010,2011 లో వరుసగా రెండు సార్లు చెన్నై టీమ్ ట్రోఫీ ని గెలుచుకుంది.

ఇక అలాగే ఈసారి గెలిస్తే ఆరోసారి చెన్నై టీం( Chennai Super Kings ) కి కప్పును అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ధోని నిలువబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక దాదాపు సంవత్సరం తర్వాత ధోని ని మరొకసారి గ్రౌండ్ లో చూడడానికి తన అభిమానులందరూ విపరీతమైన ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.ఇక అందులో భాగంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ల మధ్య మొదటి మ్యాచ్ ఈనెల 22వ తేదీన జరగనుంది.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు