దళిత బంధు బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తే దళితులకు దక్కాల్సిన డబ్బును ఎమ్మెల్యేలు రాబందుల్లా పీక్కుతింటారని ఆరోపించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మాచన్ పల్లి నుండి హాజీపూర్ రోడ్డు.యాదగిరిగుట్ట మండలం కాచారం నుండి పెద్ద కందుకూరు రోడ్డు నిర్మాణం కోసం ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద మంజూరైన రూ.4.50 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.దళిత బంధు కోసం గ్రామసభ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని కోమటిరెడ్డి సూచించారు.