కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పులివెందుల చేరుకునే అవకాశం ఉంది.
తరువాత మధ్యాహ్నం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ను అవినాశ్ రెడ్డి నిర్వహించనున్నారు.అయితే ప్రతి సోమవారం ప్రజా దర్బార్ ను నిర్వహిస్తుంటారు.
కానీ సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లో ఉండటంతో నిర్వహించలేకపోయారు.దీంతో ఇవాళ ప్రజాదర్బార్ లో పాల్గొనేందుకు అవినాశ్ రెడ్డి పులివెందులకు వెళ్తున్నారు.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.