మణిపూర్ లో భారతమాతను చంపేశారు..: రాహుల్ గాంధీ

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది.

ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు.

మణిపూర్ లో భారతమాతను హత్య చేశారని రాహుల్ గాంధీ అన్నారు.మీరు దేశ భక్తులు కాదు.

దేశ ద్రోహులంటూ మండిపడ్డారు.మణిపూర్ ప్రజలను చంపారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని, ఆ తరహాలోనే ప్రధాని మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటున్నారన్నారు.రావణుడు అహంకారమే లంకను కాల్చేసిందని తెలిపారు.

Advertisement

మణిపూర్ ను రెండు ముక్కలుగా చేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ మణిపూర్ కు మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు