దేశంలో ప్రమాదకరమైన లేడీ డాన్లు వీళ్లే!

డాన్లు అంటే కేవలం మగవారు మాత్రమే ఉండరు.ఆడవాళ్లు కూడా ఉంటారు.

డాన్ల లో దేశాన్నే వణికించిన ఆడవాళ్లు కూడా ఉన్నారు.

దావుద్ ఇబ్రహీం లాంటి మగవారు మాత్రమే కాదు అలాంటి రాక్షస గుణం ఉన్న ప్రమాదకరమైన మహిళలు కూడా ఉన్నారు.

వారు ఎవరు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

రేష్మా మేమన్ - షబానా మేమన్ :

రేష్మా మేమన్ - షబానా మేమన్ లను "ద ఉమెన్ బిహైండ్ ద బ్లాక్ ఫ్రైడే" అని కూడ అంటారు.1993 లో జరిగిన ముంబై బాంబ్ బ్లాస్ట్ లో ఈ ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించారు.వీళ్లు ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన టైగర్ మేమన్ భార్య మరియు చెల్లి.

Advertisement

ముంబై బాంబ్ బ్లాస్ట్ లో వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా ఇంటెలిజెన్స్ బృందాలు వీరిని పట్టుకోవడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు.ఇండియన్ ఏజెన్సీ వీళ్లు పాక్ లోని కరాచీలో ఉన్నారని భావిస్తోంది.

శోభా అయ్యర్ :

మిస్టీరియస్ గ్యాంగ్ క్వీన్ అని పిలవబడే శోభా అయ్యర్ తమిళనాడులో ఎన్నో నేరాలకు పాల్పడింది.రాష్ట్రంలోని రాజకీయ నాయకులే ఆమెకు ఏ సమస్య వచ్చినా అండగా ఉన్నారంటే ఆమె ఎటువంటి డాన్ అనే విషయం సులభంగానే అర్థమవుతుంది.ఎన్నో విధ్వంసాలకు కారణమైన ఈమె అసలు రూపం కూడా పోలీసులకు తెలియదంటే ఈమె ఎంత భయంకరమైన డాన్ అనే విషయం అర్థమవుతుంది.

అర్చనా పాల్ ముకుంద్ శర్మ :

అర్చనా పాల్ కిడ్నాప్ లకు పెట్టింది పేరు.ఈమెను ద క్వీన్ ఆఫ్ కిడ్నాపింగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.సినిమాల్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఎన్నో నీచమైన పనులు చేసి ఈమె వార్తల్లో నిలిచింది.

విదేశాల్లో ఉండి కూడా కిడ్నాప్ లు చేయించిన ఈమె ఉజ్జయిని ప్రాంతానికి చెందిన మహిళ.

సమైరా జుమాలీ :

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఈమె అండర్ వరల్డ్ డాన్ అబూసలెం భార్యల్లో ఒకరు.అబూసలెం పాల్పడిన ఉగ్రవాద కార్యక్రమాల్లో చాలా వాటిలో జుమాలీకి సంబంధం ఉంది.ఇంటర్ పోల్ ఈమెకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిందంటే ఈమె ఏ స్థాయి డాన్ అనే విషయం సులభంగానే అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు