బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేస్కున్న కోతి.. అయినా కాల్పుల్లో మృతి!

మనకు తెల్సినంత వరకు కోతులు మనం ఏం చేస్తే అవి చేస్తుంటాయి.అలాగే వస్తువులన్నింటిని చిందవ వందర చేస్తూ.

నానా రచ్చ చేస్తుంటాయి.అయితే సర్కస్ లో మాత్రం మాస్టర్ చెప్పినట్లు ఆడే కోతి బట్టలు వేస్కొని చక్కగా ముస్తాబవుతుంది.

అలాగే మెక్సికోలో ఓ కోతి ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నే ధరించేంది.అయితే నేరుగా అదే ఆ జాకెట్ ని ఏం వేస్కోలేదు లెండి.

దాన్ని పెంచుకుంటున్న ఓ స్మగ్లర్.తన కోతికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తొడిగాడు.అయినప్పటికీ.

Advertisement

పోలీసుల కాల్పుల్లో ఆ వానరం మృతి చెందింది.మెక్సికోలో సాదారణంగా డ్రగ్ స్మగ్లర్లు తన హోదాకు చిహ్నంగా జంతువులను పెంచుకుంటారు.

ఇలాగే ల ఫామిలియా మమిచోవాకనా ముఠాకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ఓ వానరాన్ని పెంచుకుంటున్నాడు.అయితే అతడు చేసే పనిలో రిస్క్ ఎక్కువ, పోలీసులు ఎప్పుడు కాల్పులు జరుపుతారో తెలియదు కాబట్టి తనతో పాటు తన కోతికి కూడా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ ని కొని పెట్టాడు.

కానీ దురదృష్టవశాత్తు పోలీసులు కాల్పుల్లో అతడితో పాటు కోతి కూడా ప్రాణాలు కోల్పోయింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బుల్లెట్ గాయం వల్లే కోతి చనిపోయిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అని తెల్సుకునేందుకు.దానికి శవ పరీక్ష నిర్వహిస్తామని వెటర్నరీ డాక్టర్ లు తెలిపారు.కోతి స్మగ్లర్లదే అని నిర్ధరణ అయితే.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పట్టుబడ్డ నిందితులపై జంతువుల అక్రమ రవాణా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.అయితే ఈ ఎన్ కౌంటర్ లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు