తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నుండి ఎట్టకేలకు మోనాల్ ఎలిమినేట్ అయ్యింది.ఆమెను బిగ్ బాస్ నిర్వాహకులు కావాలని ఉంచుతున్నారు అంటూ విమర్శలు వచ్చాయి.
ఓట్లు రాకున్నా కూడా ఇంట్లో గొడవల కోసం రొమాన్స్ కోసం మాత్రమే ఆమెను ఉంచుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.అయినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు వాటిని పట్టించుకోకుండా బిగ్ బాస్ ఆమెను ఇన్నాళ్లు కొనసాగించాడు.
ఆమె ఉండటం వల్ల గొడవలు చిరాకులు కాస్త ఉన్నాయి అనడంలో సందేహం లేదు.ఆమె ఉండటం వల్లే ప్రేక్షకులు కాస్త ఎంటర్‌టైన్ అయ్యారు అనడంలో కూడా సందేహం లేదు.
కాని అవినాష్ వంటి ఎంటర్‌టైనర్ ను పంపించి ఆమెను ఉంచినప్పుడే అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఎట్టకేలకు బిగ్ బాస్ నుండి ఆమెను చివరి వారంకు ముందు ఎలిమినేట్ చేసి పంపించడం జరిగింది.
ఈ సమయంలో ఆమెకు అందిన పారితోషికం గురించి చర్చ జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మోనాల్‌కు వారంకు 11 లక్షల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారట.ఈమె ఇంట్లో వ్యక్తులతో క్లోజ్ గా ఉండటంతో పాటు లవ్ ట్రాక్ నడిపేందుకు గొడవలు పెట్టేందుకు ప్రయత్నించాలంటూ బిగ్ బాస్ నిర్వాహకులు ముందే ఒప్పందం చేసుకున్నారు.ఏమాత్రం వివాదాస్పదం కాకుండా ఆమెను స్క్రిప్ట్ ప్రకారం ఆమెను నడిపించారు.
ఆమె నడక ఆశించిన దారిలోనే వెళ్లింది.ఆ మెకు అప్పగించిన టాస్క్ విజయవంతం అయ్యింది.
దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను 14 వారాల పాటు కొనసాగించారనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ 14 వారాలకు గాను ఆమె 1,54,00,000 రూపాయలను దక్కించుకుందట.
విన్నర్ అయిన వారికి కూడా ఈ రేంజ్‌లో వస్తాయా అంటే అనుమానమే అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మోనాల్ పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.