టీవీలలో అన్ని భాషలలో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ లు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి.అంతేకాకుండా బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు ప్రస్తుతం స్టార్ లుగా పేరు పొందుకున్నారు.
ప్రతి ఒక్కరిని టీవీల ముందు వాలిపోయేలా చేసుకుంది బిగ్ బాస్ షో.బిగ్ బాస్ షో ప్రతి ఒక్క సెలబ్రిటీలను ఎంపిక చేసుకోని వాళ్ళు నిజజీవితంలో ఉండే విధానమును ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
ఈ విధంగా తెలుగులో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా హిందీ, తమిళం, కన్నడం, మలయాళం లో కూడా బిగ్ బాస్ షోలు కొన్ని సీజన్ లను పూర్తి చేసుకున్నాయి.
ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తర్వాత మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.అంతే కాకుండా వారికి ఇచ్చే పారితోషికం విషయంలో అంతే స్థాయిలో ఉంటుంది.
ఇక బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఓ పాత్ర అయితే.బిగ్ బాస్ షో ను హోస్టింగ్ చేసే వ్యక్తి పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది.

తెలుగులో మొదటి రెండు సీజన్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, నాని హోస్టింగ్ చేయగా.తర్వాత మూడు, నాలుగు సీజన్ లలో హీరో నాగార్జున హోస్టింగ్ చేశారు.హిందీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేశారు.ఇక కన్నడ లో సార్ హీరో కిచ్చ సుదీప్, తమిళంలో భారతీయ నటుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు.
ఇదిలా ఉంటే మలయాళంలో నటుడు మోహన్ లాల్ హోస్టింగ్ చేయగా.ఈ హోస్టింగ్ స్టార్ ల పారితోషికం ఎక్కువగా ఉంటాయి.ఇదిలా ఉంటే మలయాళం బిగ్ బాస్ హోస్టింగ్ చేసే మోహన్ లాల్ కు ఇచ్చే పారితోషికం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఇది వరకు రూ.12 కోట్లు ఉండగా.త్వరలోనే మరో సీజన్ ప్రసారం కావడంతో ఆ సీజన్ కు రూ.18 కోట్లు తీసుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సీజన్ 3 ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది.