నెహ్రుని హంతకుడుగా అభివర్ణించిన ప్రధాని మోడీ

ప్రస్తుతం దేశం యావత్తు సార్వత్రిక ఎన్నికల మూడ్ లో ఉంది.ఇక అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలలో హీట్ పెంచుతున్నారు.

బీజేపీ పార్టీని, ప్రధాని మోడీని ఎలా అయిన అధికారంకి దూరం చేయాలనే గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది.అయితే దీనికి విరుద్ధంగా ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణం ఉంది అనే మాట బలంగా వినిపిస్తుంది.

దానికి తగ్గట్లుగానే ప్రధాని మోడీ తన మాటల వాడితో కాంగ్రెస్ పార్టీ, నెహ్రు ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా దేశ మొదటి ప్రధాని నెహ్రు మీదనే మోడీ విమర్శలు చేసారు.

ఈ ఏడాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కుంభమేళాను చాలా చక్కగా నిర్వహించారు.కానీ దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్వర్యంలో 1954లో అలహాబాద్‌లో కుంభమేళా నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరిగి వేల మంది చనిపోయారు.

Advertisement

అయితే ఈ ఘటనలో చనిపోయిన వారి పేర్లు ఒక్కటి కూడా బయటకు రాలేదు.అంతేకాక వారికి కనీసం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం అందలేద’ని మోదీ ఆరోపించారు.

నెహ్రూను కాపడటం కోసమే అప్పటి మీడియా ఈ వార్తలను ప్రజల దృష్టికి తీసుకురాలేదన్నారు మోడీ విమర్శలు చేసారు అప్పటి తొక్కిసలాట పాపం అంతా నెహ్రుదే అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు