తెలంగాణ రాష్ట్ర డీజీపీ నుండి ప్రశంసలు అందుకున్న కీరవాణి.. ఎందుకో తెలుసా..?

తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి పోలీసులను ఉద్దేశించి ఓ పాటని స్వరపరిచారు.

ఈ పాటని ఆయన తెలంగాణ పోలీస్ ప్రాణం పంచే మనసున్న పోలీస్ అంటూ పాటని స్వరపరిచారు.

ఈ పాటను తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు.తెలంగాణ పోలీసుల సేవలను కొనియాడుతూ స్వరపరిచిన ఈ పాటని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతగానో మెచ్చుకున్నారు.

ఈ పాట తాజాగా డీజీపీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు కీరవాణితో పాటు తెలంగాణ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులు చాలా మంది పాల్గొన్నారు.

ఇకపోతే ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రచించారు.గత నెలలో నిర్వహించిన పోలీస్ ప్లాడ్ డే కార్యక్రమాలకు సందర్భంగా ఈ పాటని స్వర పరిచినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ పాటను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ సందర్భోచితంగా ఈ పాట ఉందని ఆయన చెప్పుకొచ్చారు.పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొనే కష్టాల గురించి అలాగే వారికి ఎదురయ్యే ఇబ్బందులను గురించి వివరిస్తూ పోలీసులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ పాటను ఉద్దేశించి సేవలందిస్తూ ఉంటే మనతో ఎంతో మంది కలిసి వస్తారు అనడానికి ఈ అద్భుతమైన పాట నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.ముందు ముందు ప్రజలలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు కూడా వస్తాయని ఆ దిశగా పోలీసులు అందిస్తున్న సేవల గురించి సంగీత దర్శకుడు కీరవాణి పోలీసులను ప్రశంసించారు.అలాగే ఆయన గతంలో తనకు 9 సంవత్సరాలు ఉన్న సమయంలో తన మొదటి కార్యక్రమం పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఇచ్చారంటూ ఆయన చెప్పుకొచ్చారు.1998లో ఇస్తున్న ప్రాణం మీకోసం అనే పోలీస్ త్యాగాలను తెలియజేసే ఈ పాటను అప్పట్లో ఆలపించాను అని చెప్పుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతం పాడిన పాటను తాను హిందీలో కూడా కంపోజిషన్ చేస్తానని కీరవాణి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు