ఎమ్మెల్సీ వార్ ప్రీ పోల్ స‌ర్వే: ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ గెలిచేనా ?

ప్రొఫెసర్ కోదండరామ్ కు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పరీక్షగా మారాయి.తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఆయ‌న దిగుతున్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ పెట్టినా కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ కూట‌మితో క‌లిసి ఆయ‌న పోటీ చేసిన ఐదు చోట్లా ఆయ‌న పార్టీ అభ్య‌ర్థులు ఘోరంగా ఓడిపోయారు.

ఆ త‌ర్వాత కోదండ‌రాం వర్సెస్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మ‌ధ్య తీవ్ర‌మైన యుద్ధం జ‌రిగింది.ఇక ఇప్పుడు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటుగా ఉన్న చోట కోదండ‌రాం పోటీ చేస్తున్నారు.

ఇక్క‌డ నుంచి అధికార పార్టీ త‌ర‌పున ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ పోటీ చేస్తున్నారు.

Advertisement

బీజేపీ నుంచి ప్రేమేంద‌ర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జేఏసీ చైర్మ‌న్‌గా ఎంతో క‌ష్ట‌ప‌డ్డ ఆయ‌న్ను ఆ త‌ర్వాత అన్ని పార్టీలు ప‌క్క‌న పెట్టేశాయి.

ఉద్యమ సమయంలో ఆయన సేవలను వినియోగించుకుని ఆ తర్వాత టీఆర్ఎస్ కూడా పక్కన పెట్టేసింది.ఈ ఎన్నిక‌ల్లో కోదండ‌రాంకు కాంగ్రెస్ అయినా స‌పోర్ట్ చేస్తుంది అనుకుంటే.

ఆ పార్టీ కూడా హ్యాండ్ ఇచ్చి రాములు నాయ‌క్‌ను పోటీకి పెట్టింది. కోదండ రాం పెద్ద‌ల స‌భ‌కు వెళితే బాగుంటుంది అన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆయ‌న పెద్దల స‌భ‌లో ఉంటే బ‌ల‌మైన వాణి వినిపించి ప్ర‌జాభిప్రాయాన్ని స‌భ‌లో వినిపిస్తార‌ని ప‌లువురు అంటున్నారు.ఈ క్ర‌మంలోనే విద్యార్థుల్లో మెజార్టీ వ‌ర్గాలు ఆయ‌న‌కే స‌పోర్ట్ చేస్తున్నాయి.ఇప్పటికే పూర్వ విద్యార్థులంతా రంగంలోకి దిగి కోదండరామ్ కు అండగా నిలుస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

రాజకీయ పార్టీలు ఆయ‌న‌కు హ్యాండ్ ఇచ్చినా కూడా ప‌లు వ‌ర్సిటీల్లో విద్యార్థి సంఘాలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకి దిగాయి.ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వెన్నుదన్నుగా నిలుస్తామంటున్నారు.

Advertisement

ఇక అక్క‌డ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంతో పాటు ప‌లు ప్రీ పోల్ స‌ర్వేలు సైతం కోదండ రాం గెలుస్తార‌ని అంటున్నారు.మ‌రి కోదండ రాం పెద్ద‌ల స‌భ‌కు వెళ‌తారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

తాజా వార్తలు