గుడ్లవల్లేరు మండలం శ్రీ కొండలమ్మ అమ్మవారిని దర్శించుకున్న కొడాలి నాని దంపతులు..

కృష్ణాజిల్లా: గుడ్లవల్లేరు మండలం "వేమవరం" గ్రామంలో వేంచేసిన శ్రీ "కొండలమ్మ" అమ్మవారిని "విజయ దశమి" సందర్బంగా రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండగా మాజీ మంత్రి శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు నాని దంపతులు అమ్మవారిని దర్శించుకునియున్నారు.

మీడియాతో మాట్లాడుతూ.

గతంలో మన రాష్ట్రం, మన హైద్రాబాద్ అని, సంపదను, అన్ని వసతులు కల్పించి, అభివృద్ధి చేస్తే ప్రాంతీయ విద్వేషాలు వచ్చి విడిపోవాల్సి వచ్చిందని.రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాలని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని.

కొంతమంది "అమరావతి మాత్రమే" అభివృద్ధి చెందాలని ఉద్యమం నడిపిస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అమ్మవారి దీవెనలు రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డిగారికి ఉండాలని కోరుకున్నానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈవో, చైర్మెన్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొనియునారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు