నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే అదృష్టమే అదృష్టం..!

చాలా మందికి ఎంత కష్టపడి పని చేసిన వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించదు.ఏ పని మొదలుపెట్టిన అపజయం ఎదురవుతూ ఉంటుంది.

అలాంటి వారికి మన హిందూ శాస్త్రం ( Hindu science )ప్రకారం కొన్ని వస్తువులను నీటిలో వేసి ఆ నీటితో తల స్నానం చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా దూరం అయిపోతాయనీ పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇలా చేయడం వల్ల వారి పనులు సజావుగా జరగడమే కాకుండా వారి ఆర్థిక ప్రగతికి కూడా సహాయపడుతుంది.

ఇంకా చెప్పాలంటే ఉద్యోగ సమస్యలు, దృష్టి దోషాలు( Job problems, vision defects ) వంటి వాటికీ కూడా విరుగుడు కలుగుతుంది.నీటిలో ఎలాంటి వస్తువులు కలపాలో,వాటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ సంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

పసుపు క్రిమి సంహారిణిగా కూడా ఎంతో బాగా పనిచేస్తుంది.ఏ పని మొదలుపెట్టిన సమస్యలు ఎదురయ్యేవారు పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల వారి మెదడులోని నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి, పాజిటివ్ గా ఆలోచించి వెళ్లిన పని నెరవేర్చుకుని వస్తారు.

ఇంట్లోనీ అశాంతి కూడా తగ్గిపోతుంది.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం చందనం విజయం, సంపద మరియు కీర్తిని కలిగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.చిటికెడు గంధపు పొడిని( Sandalwood powder ) స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

అలాగే ఒత్తిడిని తగ్గించి సానుకూల శక్తిని పెంచుతుంది.ప్రాణానికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే వేప పువ్వులలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్రిమి సంహారక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.

భారతీయ సంప్రదాయంలో వేప పువ్వులు శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్మకం.మనం స్నానం చేసే నీళ్లలో గుప్పెడు వేపా పువ్వులను వేసి తల స్నానం చేయడంతో శుభం కలుగుతుంది.

తాజా వార్తలు