కోతులను పెంచుకునేందుకు న్యాయ పోరాటం

కొందరికి కుక్కలను పెంచడం సరదా.ఇంకొందరికి పక్షులు, కుందేళ్లు పెంచుకోవడంపై మక్కువ.

అయితే అన్ని దేశాల్లోనూ వన్య ప్రాణుల చట్టాలు ఒకేలా ఉండవు కదా.

ఈ క్రమంలో ఓ మహిళ కోతులను పెంచుకోవడానికి పోరాటం చేస్తోంది.

  క్రీవ్ కోయిర్ కు చెందిన మెక్‌బ్రైడ్ టీహాన్ తన ఇంట్లో మూడు కోతులను పెంచుకుంటోంది.ఈ క్రమంలో ఒక నెల క్రితం క్రీవ్ ఇంటిపక్కన ఉండే వ్యక్తి కోతిని గుర్తించాడు.క్రీవ్ కోయిర్ చట్టాల ప్రకారం.

నివాస ప్రాంతాల్లో మొసళ్లు, సింహాలు, కొండచిలువలు వంటి వన్య ప్రాణులను పెంచుకోవడం నిషేధం.ఈ సంగతి గుర్తొచ్చిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మెక్‌బ్రైడ్‌ను సెప్టెంబర్ 9న సిటీ కౌన్సిల్ ముందు హాజరుపరిచారు.

  అయితే కోతులతో తనకు అనుబంధం ఉందని.వీటిని పెంచుకోవడానికి వైద్యుల వద్ద నుంచి రిజిస్ట్రేషన్ లెటర్, ఇతర పత్రాలు ఉన్నాయని మెక్‌బ్రైడ్ కౌన్సిల్ ముందు ప్రస్తావించారు.అంతేకాక తనకు చిన్న వయసులో ఉన్న మానసిక సమస్యను అధిగమించేందుకు కోతుల వద్ద గడపటం ఉపయోగపడిందన్నారు.

ఆమె ఎంతగా చెప్పినప్పటికీ మెక్‌బ్రైడ్‌ వాదనను కౌన్సిల్ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.వచ్చే నవంబర్‌లో జరిగే విచారణకు ఆమె హాజరుకానుంది.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..

Advertisement

తాజా వార్తలు