గత కొన్ని రోజులుగా వాట్సప్( Whatsapp ) గురించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం అందరికీ తెలిసినదే.
చాలామంది వాట్సప్ యూజర్లకు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి మిస్డ్ వాయిస్ కాల్స్ ఎక్కువగా రావడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది.
ఒక నెంబర్ కాకపోతే మరో నెంబర్ నుంచి ఈ మిస్డ్ కాల్స్ వస్తూనే ఉండడం వలన చాలామంది యూజర్లు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసినదే.కాగా ఇది వాట్సప్‌లో కొత్త స్కామ్ అని తెగ ప్రచారం జరుగుతోంది.
దాంతో వాట్సప్ యూజర్లు అలెర్ట్ అవుతున్నారు.అయితే ఈ వాట్సప్ కాల్స్( WhatsApp calls ) వెనుక ఎలాంటి స్కామ్ లేదని తాజాగా వార్తలొస్తున్నాయి.అలాంటప్పుడు ఈ మిస్డ్ కాల్స్ ఎందుకొస్తున్నాయని డౌట్ రావొచ్చు.
అది తెలుసుకునేందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్యాప్తు జరపగా ఈ దర్యాప్తులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.వాట్సప్ యూజర్లకు మే 1 నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి.
డేటా ఒకసారి పరిశీలిస్తే, మలేషియా ( Malaysia )(+60), ఇథియోపియా( Ethiopia ) (+251), వియత్నాం (+84), కెన్యా (+254), ఇండోనేషియా (+62) దేశాల నుంచి వాట్సప్ యూజర్లకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణుల దర్యాప్తులో తేలింది.అసలు ఈ కాల్స్ ఎందుకు వస్తున్నాయని డి ఎన్ ఏ ఓ కథనం పబ్లిష్ చేసింది.ఇవి స్కామ్ కాల్స్ కాదు అని, స్పామ్ కాల్స్ అని ఆ కథనంలో డి ఎన్ ఏ పబ్లిష్ చేసింది.
భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల్లో ఒకరు, భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ మెంబర్ అయిన అమిత్ దూబే ఈ వాట్సప్ కాల్స్ గురించి డి ఎన్ ఏ కి దీనిగురించి చెప్పడం జరిగింది.అయితే ఈ విషయంపైన ఇంకా పూర్తి వివరాలు అనేవి ప్రకటించాల్సిన అవసరం ఉందని కొంతమంది వాట్సాప్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy