ఓటర్లకు డబ్బుల పంపిణీపై వైసీపీ నేతలతో మంత్రి ఉషశ్రీ మాట్లాడుతున్న వీడియో వైరల్..

అనంతపురలో ఓటర్లకు డబ్బుల పంపిణీపై వైసీపీ నేతలతో మంత్రి ఉషశ్రీ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీపై ఆమె ఆరా తీశారు.

ఓటర్లకు డబ్బుల పంపిణీపై నాయకులతో చర్చించారు.బూత్‌ల వారీగా ఎవరెవరికి డబ్బులు పంచారని అడిగి తెలుసుకున్నారు.

డబ్బులు తీసుకున్న వారి సంతకాలు తెచ్చారా అంటూ పార్టీ నాయకులతో చర్చించారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డబ్బుల పంపిణీ వ్యవహారంలో స్వయంగా మంత్రి ఉషశ్రీనే ఉండటంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.అధికార పార్టీ నేతల ప్రలోభాలపై అటు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Advertisement
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు