ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి కుటుంబం

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబం ఐటీ విచారణకు హాజరుకానుంది.మల్లారెడ్డితో పాటు మొత్తం 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల రెండు రోజులపాటు నిర్వహించిన సోదాల్లో ఐటీ కీలక ఆధారాలు సేకరించింది.ఈ తనిఖీలలో బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఐటీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.తన తరపున ఐటీ విచారణకు ఆడిటర్ హాజరు అవుతారని పేర్కొన్నారు.

అదేవిధంగా తన కుటుంబ సభ్యులు విచారణకు హాజరవుతారని చెప్పారు.ఉప్పల్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు