ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి రియాక్షన్

వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్నకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటి రెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో.?వారు ఏ పార్టీలో ఉంటారో.? ఎవ్వరికీ అర్ధం కాదన్నారు.కాంగ్రెస్ లో ఉండి బీజేపీని గెల్పించమని,బీజేపీలో కాంగ్రెస్ ని గెల్పించమని అనేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

Latest Suryapet News