సిద్దిపేట జిల్లా పదవ తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మంత్రి హరీష్ రావు..!!

సిద్దిపేట కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన కాసేపు ముచ్చటించారు.

చదువు పట్ల పిల్లలకు ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ క్రమంలో విద్యార్థులకు సెల్ ఫోన్ లు దూరంగా ఉంచాలని అన్నారు.

ప్రస్తుత రోజులలో విద్యార్థులు సెల్ ఫోన్ లకి బాగా ఆకర్షితులవుతున్నారని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణతలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

ఈసారి కూడా తొలి స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు.

Advertisement

పదికి పది జీపీఏ తెచ్చుకునే విద్యార్థులకు.పదివేల రూపాయల బహుమానం ఇస్తానని.సిద్దిపేట జిల్లా పదవ తరగతి విద్యార్థులకు మంత్రి హరీష్ రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

ఇదే సమయంలో 100% ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు 25వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని స్పష్టం చేశారు.పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు