Minister Gummanur Jayaram : వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా..!

ఏపీలో వైసీపీకి( YCP ) షాక్ తగిలింది.పార్టీతో పాటు మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం( Minister Gummanur Jayaram ) రాజీనామా చేశారు.

ఈ మేరకు వైసీపీ వీడుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.అలాగే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో( TDP ) చేరుతున్నానని ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం( Kurnool Constituency ) నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారన్న గుమ్మనూరు తనకు ఇష్టం లేదని చెప్పారు.

ఈ క్రమంలోనే టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు.12 ఏళ్లుగా వైసీపీలో ఉన్నానన్నారు.అయితే ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

Advertisement

ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవి వద్దన్నట్లు పేర్కొన్నారు.నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఇక్కడే ఉంటానని తెలిపారు.

కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు