బండి సంజయ్ కు తెలిసే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి - మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు.బండి సంజయ్ కు తెలిసే పేపర్ లు లీకేజీ లు జరుగుతున్నాయి.

లీకేజీ లు బీజేపీ కుట్ర.దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి.

పేపర్ లీకేజీ అయ్యాక సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా.కమలా పూర్ లో లీకేజీ చేసిన ప్రశాంత్ అనే యువకుడు బండి సంజయ్ తో వందల కాల్స్ చేశారు.వాట్సాప్ చాట్ లను ఢీకోడ్ చేస్తాం.

ఎంతటి వారైనా శిక్ష తప్పదు.బీజేపీ విష రాజకీయాలకు తెరలేపింది.

Advertisement

బీఆర్ ఏస్ ను లీకేజీ ప్రభుత్వంగా చిత్రీకరించే కుట్ర చేస్తుంది.రాజకీయ లబ్ది కోసం బీజేపీ దిగజారి ప్రవర్తిస్తుంది.

బండి సంజయ్ ని నేరుగా అడుగుతున్నా.పేపర్ లీకేజీ లో బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు .రాజశేఖర్ రెడ్డి A2 ముద్దాయి అతను బీజేపీ నాయకుడు.హిందీ పేపర్ లికేజీలో ప్రశాంత్ బీజేపీ కార్యకర్త.

బండి సంజయ్ కి పేపర్ రాగానే బీజేపీ గ్రూపుల్లో ప్రచారం చేశారు.అశాంతి అలజడి రేపి బీహార్ సంస్కృతి తెలంగాణ ను మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది .బీజేపీ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తుంది.తల్లితండ్రులు ఆలోచించాలి.

తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం బీజేపీ.పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం బండి సంజయ్ ను తీసుకొచ్చిన పోలీసులు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

మరి కొద్ది సేపట్లో.బండి సంజయ్ ను వర్దన్నపేట పోలీస్ స్టేషన్ వైపు తీసుకువెళ్ళనున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు