Drumstick : మునగ పంటను ఆశించే ఆకుతినే పురుగుల నుండి పంటను సంరక్షించే పద్ధతులు..!

మునగ చెట్లను ఒకప్పుడు పెరటి తోటల్లో పెంచేవారు.అయితే వాణిజ్యపరంగా సాగు చేస్తున్న కూరగాయ పంటలలో ప్రస్తుతం మునగ పంట కూడా ఒకటి.

 Methods Of Protecting The Crop From The Insect Pests That Are Expecting The Dru-TeluguStop.com

మన దక్షిణ భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న కూరగాయ పంటలలో ఈ మునగ పంట కూడా ఉంది.

Telugu Agriculture, Drumstick Crop, Leaf Insects, Methodscrop, Ph-Latest News -

మునగ పంట( Drumstick crop ) సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 6-7.5 ( pH value is 6-7.5 )మధ్య ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.మునగ పంట సాగులో సేంద్రీయ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

మునగ చెట్ల మధ్య, చెట్ల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగులుతుంది.దీంతో మొక్కలు ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు వివిధ రకాల చీడపీడలు( Pests ) లేదంటే తెగుళ్ల వ్యాప్తి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.

మునగ పంట అధిక చలిని తట్టుకోలేదు.ఇక పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.పంటకు ఏవైనా తెగులు ఆశిస్తే, ఆ మొక్కలను తొలగించడం వల్ల తెగుళ్ల వ్యాప్తి ఉండదు.

Telugu Agriculture, Drumstick Crop, Leaf Insects, Methodscrop, Ph-Latest News -

మునగ పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికొస్తే.ఆకు తినే పురుగులు( Leaf-eating insects ) కీలక పాత్ర పోషిస్తాయి.ఈ పురుగుల ఉధృతి డిసెంబర్-జనవరి, మార్చి-ఏప్రిల్ నెలలో అధికంగా ఉంటుంది.

ఈ పురుగుల లార్వాలు పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.ఇవి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.

ఈ పురుగులను గుర్తించిన తర్వాత రెండు మిల్లీలీటర్ల క్వినాల్ ఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ పురుగులను పూర్తిగా అరికట్టాలి.అధిక దిగుబడి సాధించాలంటే పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలి దశలోనే చీడపీడలు లేదంటే తెగులను పూర్తిస్థాయిలో అరికట్టాలి.

కాబట్టి సాగు విధానంలో ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలో ఉండే వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తెలుసుకొని పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube